Advertisements

చిత్తూరు యాసకు సై అంటున్న బన్నీ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా పడే హీరోలలో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. లుక్స్ పరంగా సినిమా సినిమాకు డిఫరెంట్ గా వర్కౌట్ చేసే బన్నీ ఇప్పుడు సుకుమార్ తో చేయబోతున్న సినిమాకోసం కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాడట. దర్శకులు తన దగ్గర నుంచి ఏదైనా కొత్తదనం కోరుకున్నప్పుడు.. దానిని నేర్చుకునేందుకు కూడా ఉత్సాహాన్ని చూపెట్టే బన్ని ఇప్పుడు సుకుమార్ మూవీ కోసం చేస్తున్న కొత్త కసరత్తులు మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

అల వైకుంఠపురం తరువాత బన్నీ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. అందుకోసం రాయలసీమ భాషను నేర్చుకునేందుకు బన్నీ ప్రత్యేకంగా ట్యూటర్‌ను పెట్టుకున్నాడట. ముఖ్యంగా చిత్తూరు జిల్లా యాస మీద పట్టు తెచ్చుకునేందుకు ఆయన పాఠాలను నేర్చుకుంటున్నారట. ముఖ్యంగా ఇక త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన తరువాత.. బన్నీ, సుకుమార్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ లోపు కాస్త బ్రేక్ తీసుకోనున్న అల్లు అర్జున్.. లుక్ మీద కూడా కసరత్తులు పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉంటే బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురంలో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: