డ్రింక్ అండ్ డ్రైవే ఆక్సిడెంట్ కి కారణమా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్‌ కారు బోల్తా పడింది. శంషాబాద్‌ దగ్గరలోని పెద్ద గోల్కండ దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టిన రాజశేకర్ కార్ ఆక్సిడెంట్ సంఘటన వెనకాల షాకింగ్ కారణాలు బయటపడుతున్నాయా, రాజశేఖర్ స్వయంకృతాపరాధమే యాక్సిడెంట్ కి కారణమంటూ సోషల్ మీడియా చెప్తున్నా మాటల్లో నిజమెంత..?

నైట్ షూట్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటి తిరిగి వస్తుండగా రాజశేఖర్‌ కి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవటంతో రాజశేకర్ కి పెను ప్రమాదమే తప్పింది. ప్రమాదం తరువాత మరో కారులో రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డట్టు తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన కారులో మందు బాటిళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తిచారట, రాజశేఖర్ కూడా మద్యం మత్తులోనే కార్ నడిపాడా అన్న కోణంలో పోలీస్ ఇన్విస్టిగేషన్ సాగుతుందట.
సెలబ్రెటీలు షూట్ అయిపోయాక కొంచం మద్యం తీసుకోవటం కామన్ అని కానీ రాజశేఖర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయటమే ఇక్కడ నేరమని,ఒకవేల ఇదే కనగ విచారణలో తేలితే రాజశేఖర్ పై కేసు కూడా నమోదయ్యా అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ ఆక్సిడెంట్ పై ఇప్పటికే రాజశేఖర్ నేను సురక్షితమని స్పందించగా, అభిమానుల కోసం జీవిత కూడా తాజాగా వీడియో బైట్ రిలీజ్ చేసింది. ఇక ఔటర్ రింగ్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలెన్నో నిత్యం భయపెడుతున్నాయి. సెలబ్రిటీ లు ఔటర్ లో ప్రమాదాలకు గురవుతుండడం కలత కు గురి చేస్తోంది. హీరో రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు అని తెలియ గానే అభిమానులు కంగారు పడ్డారు. ఆయన క్షేమ సమాచారం తెలుసుకుని పరిశ్రమ వర్గాలు సహా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: