శభాష్ మహేష్ అంటున్న కమల్ హాసన్.. !

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటాడు. ఏదైనా సినిమా వీక్షించినప్పుడు, అది నచ్చితే సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ ఉంటాడు. తోటీ హీరోల పుట్టినరోజు సందర్భంగా కూడా ట్వీట్ చేసి వారిని విష్ చేస్తూ ఉంటాడు. తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ కి కమల్ రెస్పాండ్ అయ్యాడు. మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తాడు ఈ లోకనాయకుడు.

కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు అసాధారణం.. నటుడిగా అరవై యేళ్లు గడిచినందుకు కంగ్రాట్స్.. ఇది నిజంగా స్ఫూర్తి వంతం.. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన మహేష్ కి లేట్ గా అయినా లేటెస్ట్ గా ట్వీట్టర్ లో రిప్లయి ఇచ్చాడు కమల్ హాసన్. ధన్యవాదాలు మహేష్ జి. నువ్వు కూడా కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి అద్భుతమైన నీ కెరీర్ లో గొప్ప ఎత్తుల ను అందుకుంటున్నావు. నీ శుభాకాంక్షల ను నేను గౌరవప్రదం గా స్వీకారిస్తున్నాను.
విష్ యు ఆల్ ది బెస్ట్” అంటూ మహేష్ కెరీర్ పట్ల తను ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపాడు. అయితే కమల్ హాసన్ ఆలస్యంగా స్పందించినా.. మహేష్ మాత్రం వెంటనే రిప్లై ఇచ్చాడు. కమల్ ట్వీట్‌కు మహేష్ రిప్లై ఇస్తూ.. ధన్యవాదాలు సర్.. ఎల్లప్పుడు మీపై మాకు ప్రేమా గౌరవం ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్‌లొ బిజీగా ఉన్నాడు. అయితే ఈ పుట్టినరోజుకు ఒక ప్రత్యేక సందర్భం ఉన్నందుకు ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు లోకనాయకుడు. సినీ జీవితంలో అడుగు పెట్టి అరవై యేళ్లు గడవడంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నా కమల్ హాసన్ తన గురువైన కె బాలచందర్ విగ్రహాన్నికూడా ప్రతిష్టించి తన గురుభక్తిని చాటుకున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: