పవన్ కళ్యాణ్.. ప్రజల కోసం పార్టీ పెట్టాడు.. ప్రజలకు కష్టం వస్తే ముందుండి పోరాడే వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయ్యాడు.. ఎన్నికల తరువాత పెద్దగా పాలిటిక్స్ లో అంత యాక్టివ్ గా కూడా కనపడలేదు.. ఇక సినిమాల్లోకి రాను అన్న పవన్ సినిమా కథలు కూడా వింటూ మళ్ళీ సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టడం కూడా మనం చూసాము.. ఇక రాజకీయాలను కొంతకాలం పక్కన పెట్టేస్తాడు అని అందరూ అనుకునే సమయం లోనే తళుక్కు మని మెరిసాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేశాడు.. ఇసుక కొరత సమస్య రోజురోజుకీ పెరుగుతుండటంతో కార్మికుల ఆత్మహత్యలు పెరుతుండటంతో ఆయన ప్రభుత్వం పై నిరసన చేయడం ప్రారంభించాడు. ప్రజల్లోకి వెళ్ళాడు ప్రభుత్వం పై మాటల తుటాలతో దాడి చేశాడు.
ఇసుక కొరత కోసం వామపక్షాలతో జతకట్టి లాంగ్ మార్చ్ నిర్వహించాడు. టీడీపీ పార్టీ కూడా తోడవడంతో లాంగ్ మార్చ్ సక్సెస్ అయ్యింది మళ్ళీ ప్రజాధరణ లభించింది. కానీ అందరికీ ఓ చిన్న అనుమానం వచ్చింది.. అదే బాబు పవన్ లు కలవడం..! ఎన్నికల సమయంలో లేని ఈ ప్రేమ ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి వచ్చేసింది ఏంటి అని.. నిజానికి ఇసుక కొరత సమస్య ఊహించినదానికన్నా పెద్దగా అవ్వడం.. కార్మికుల ఆత్మహత్యలు పెరగటం ఇద్దరినీ కలిపుండవచ్చు.. కానీ తెర వెనుక కాస్త పెద్ద ప్లానింగే జరిగిందని ఇద్దరు కలవడం వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 ఎన్నికల కల్లా పవన్ పవర్ పెరుగుతుందని పవన్ పార్టీతో బీజేపీ ని కలపాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.. ఈ వ్యూహానికి టీడీపీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని టాక్. దానికి సంకేతంగా మొన్న పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కి టీడీపీ సపోర్ట్ చేయడం.. ఇక తరువాత చేయబోయే పనుల గురించి చర్చించడానికే నేడు పవన్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.. ఏదో ప్రైవేట్ సంస్థతో మీటింగ్ అని పేరు చెప్పి ఢిల్లీ వెళ్ళిన పవన్ రేపు అమిత్ షా మోడీలను కలవనున్నారని వారితో చర్చ జరపనున్నారని అంతర్గత సమాచారం.
2024 కల్లా జనసేన బీజేపీ లతో పాటు ఇతర వామపక్షాలు అన్నీ కలిసి కూటమిలా ఏర్పడుతాయని అలా కూటమిలా పోటీ చేస్తే వైసీపీ పై పైచేయి పొందవచ్చు అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. కుదిరితే టీడీపీ నీ కూడా ఈ కూటమిలో కలపాలని యోజనలో మోడీ అమిత్ షా లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ గుసగుసలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఇక పవన్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చినతరువాత రాష్ట్రంలో ఇంకొంత జోష్ పెరగనుందని.. పవన్ గలానికి టీడీపీతో పాటు బీజేపీ గళం కూడా జత అవ్వబోతుందని ఏపీ లో టార్గెట్ జగన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది.