జబర్దస్త్ కి ఇక సెలవు.., తీవ్ర మనస్థాపంతో నాగబాబు కన్నీళ్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎనిమిది సంవత్సరాల జబర్దస్త్ ప్రస్థానంలో ముసలం. మ్యానేజిమెంటుకి క్రియేటివ్ డిపార్ట్ మెంటుకి ఏర్పడ్డ క్లాష్ కాస్త నాగబాబుతో విబేధాల స్థాయి వరకూ వెళ్లిపోయిందట. జబర్దస్త్ ఇంతటి సక్సెస్ అవ్వడంలో కమెడియన్స్ కామెడీ, యాంకర్స్ గ్లామరే కాకుండా జడ్జెస్ పాత్ర కూడా ఎంతో ఉంది. జబర్దస్త్ పై ఎలాంటి విమర్శలొచ్చినా ఒంటికాలిపై లేచి కౌంటర్ ఇచ్చే నాగబాబు ఇక జబర్దస్త్ లో ఉండడు అన్నది, జబర్దస్త్ వీక్షకులని కలచివేస్తున్న అంశం.

నాగబాబు లేదా రోజా ఏ ఒక్కరు లేకున్నా రాకున్నా కూడా ఆరోజు జబర్దస్త్ షో వెలితిగా అనిపిస్తుంది. అలాంటిది నాగబాబు షో నుండి శాస్వతంగా తప్పుకుంటున్నారు అంటూ బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా పలు మీడియాల్లో ఈ విషయం ప్రముఖంగా వినిపిస్తుంది. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ అయిన మల్లెమాల వారితో డైరెక్టర్స్ భరత్ మరియు నితిన్ లు విభేదాల కారణంగా షో కు దూరం అయ్యారట. వారితో మంచి బాండింగ్ ఉన్న నాగబాబు కూడా వారి రూట్ లోనే బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. దాంతో పాటు వీరికి మరో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. జబర్దస్త్ నుండి నాగబాబు మాత్రమే కాకుండా మరి కొందరు కమెడియన్స్ కూడా వెళ్తారనే టాక్ నడుస్తోంది. నాగబాబుకు అత్యంత సన్నిహితులుగా ప్రచారం జరుగుతున్న సుడిగాలి సుధీర్.. హైపర్ ఆది మరియు చమ్మక్ చంద్రలతో పాటు మరికొందరు కమెడియన్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయట. ఇదే గనక నిజమైతే ఇక అప్పట్లో జబర్దస్త్ అనే కామెడీ షో ఉండేది తెలుసా అని ప్రేక్షకులు మాట్లాడే స్థాయికి జబర్దస్త్ వెళ్ళటం కాయం అంటున్నారు నెటిజన్స్.

Share.

Comments are closed.

%d bloggers like this: