పుట్టా మధు కేసును కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టిన రామగుండం సి.పి

Google+ Pinterest LinkedIn Tumblr +

వారం రోజుల విచారణ….. 10రోజుల అబ్క్సాండ్ ను పక్కకు నెట్టినే వైనం
ఇంతకి పుట్టా మధుకి… వామనరావు దంపతుల హత్య కేసుకి సంబంధం ఉందా లేదా..

మంథని…. వామన రావు దంపతుల హత్య కేసులో ప్రధానంగా వినిపించిన పేరు పుట్టా మధు. మంథని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు ఈ హత్యకు కర్త, కర్మ, క్రియ అని వామన రావు తండి కిషన్ రావు ఆరో పించారు. తన కొడుకు, కోడలు హత్యకు నగదు, వాహనం, ఆయుదాలు సమకూర్చింది కూడా మధు నే అని ప్రధాన మైన ఆరోపణ చేశారు. అయితే ఈటెల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో పుట్టా మధు పరారయ్యారు. అందరు తన రాజకీయ గురువు పై భూ ఆక్రమణ కేసులు నమోదు, మంత్రి పదవి బతరఫ్ తో నెక్ట్ టార్గెట్ మధు అనే అనుమానంతో పరారయ్యారా లేక వామనరావు కేసులు ఆధారాలు దొరికాయని పరారి లో ఉన్నారా అని మాట్లాడుకున్నారు. అయితే నాలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చిన పుట్టా మధును భీమవరం లో అరెస్ట్ చేసి రామగుండం తరలించారు. ఇంత వరకు బాగానే ఉన్నా రామగుండం సి.పి కార్యాలయంలో ఏం జరిగింది అనేదే అప్పుడు అసలు ప్రశ్న. వరుసగా ఐదు రోజులు విచారణకు హాజరయిన పుట్టా మధు అసలు ఏ ఏ విషయాలు పోలీసుకు చెప్పాడు. ఆయన పరారికి కారణాలు ఏంటి, వామనరావు హత్య కేసులో పుట్టా మధు పాత్రం ఎంత… అనే అనేక అనుమానాలను పోలీసులు నివ్రుత్తి చేస్తారని అందరు భావించారు. కాని ఎవరు ఊహించని విధంగా… రామగుండం సి.పి ఈ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు నోరు మెదప లేదు. పుట్టా మధు ఏమి తెలియనట్లు నియోజక వర్గంలో తిరుగుతున్నాడు. మరి విచారణ జరిపింది దేని కోసం, విచరాణలో ఏం నిజాలు రాబట్టారు.. రామగుండం కమీషనర్ సత్యన్నారాయణ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా లేక పై నుండి ఒత్తిడి కారణంగా సైలెంట్ అయ్యారా అనేది తేలాల్సి ఉంది. మరి కిషన్ రావు పిటీషన్ పై ఏం ఎక్వైరి చేశారనేది చేబుతారేమో అని వామనరావు తండ్రి ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఈ కేసును నిధానంగా కోల్డ్ స్టోరేజ్ కి పంపే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి… మరి వామనరావు దంపతుల హత్య కేసులో ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: