వామనరావు హత్య కేసు లో పుట్టా మధు జంప్

Google+ Pinterest LinkedIn Tumblr +

మంథని…. వామనరావు దంపతుల హత్యకేసులో పోలీసులు చార్జ్ షీట్ సిద్దం చేశారు. చార్జ్ షీట్ ను ఆన్ లైన్ లో ఉంచుతున్నట్లు స్దానిక పోలీసులు తెలియజేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న మంథని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు పేరు లేదని ప్రాధమిక సమాచారం అందుతోంది. ఈ కేసులో ఏ1 గా కుంటా శ్రీను, ఏ2 గా చిరంజీవి, ఏ3 గా బిట్టు శ్రీనుతో పాటు మరో నలుగురి పేర్లు చార్జ్ షీట్ లో ఉంచినట్లు సమాచారం. అయితే వామనరావు చనిపోతు చివరిగా మాట్లాడిన విడియోలు క్లియర్ గా పుట్టా మధు పేరు చెప్పారు. అలాగే పుట్టా మదు కూడా ఈ కేసులో తనను అరస్ట్ చేస్తారనే భయంతో పది రోజులు పరారయిన విషయం తెలిసిందే. అయితే పరారిలో ఉన్న పుట్టా మధును పట్టుకొచ్చిన పోలీసులు ఆయనను ఐదు రోజులు విచారణ చేశారు. ఆయన భార్యతో పాటు ఆయన స్నేహితులను విచారించారు. కాని విచారణలో ఏం మాట్లాడారు, పుట్టా మధు ఎందుకు పరారయ్యాడనే విషయాన్ని పోలీసులు ఇప్పటికి తెలియజేయలేదు. కాగా పోలీసులు ఫైల్ చేయబోతున్న చార్జ్ షీట్ లో పుట్టా మధు పేరు లేదని తెలియగానే వామనరావు తండ్రి కిషన్ రావు, ఈ కేసులో మాకు న్యాయం జరగదు అని వాపోయారట. మరి పుట్టా కు ఈ కేసుకు అసలు సంబంధం లేకపోతే ఎందుకు ఆయన పరారయినట్లు, పోలీసులు పట్టుకొచ్చి ఎందుకు విచారించనట్లు, రెండు కోట్ల నగదు డ్రా చేశారని బ్యాంక్ లావాదేవిల వివరాలు కావాలని బ్యాంకులను ఎందుకు కోరినట్లు.. ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు రామగుండం పోలీస్ కమీషనర్ సత్యన్నారాయణ చుట్లు తిరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా సిపిగారు నోరు తెరుస్తారా, అసలు వాస్తవాలు ప్రజలకు చెబుతారా లేదో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: