కరోనాకు ఆనందయ్య మందు.. కంట్లో వేయగానే వైరస్ ఖతం….!

Google+ Pinterest LinkedIn Tumblr +

మహా డెస్క్….. కరోనాకు ఆయుర్యేద మందు వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం క్రిష్ణ పట్నం కు చెందిన ఆనందయ్య కరోనాను నాటు మందుతో తగ్గిస్తానని చెప్పడం, ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం, అందుకు ఏపి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. క్రిష్ణపట్నం కు చెందిన బొనిగే ఆనందయ్య అనేక సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం పై మంచి పట్టు ఉంది. కిడ్ని, లివర్, గుండె సంబంధిత అనేక సమస్యల పై ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు. తాజాగా ఆయన కరోనాకు సంబంధించి ఓ నాటు మందు తయారు చేశారు. ఈ ఆయుర్వేద మందులో తిప్పతీగ, తాటిబెల్లం తేనే, వేపాకులు, మామిడిచిగురులు, అల్లం, పిప్పింటి ఆకు, జాజికాయ ఇలా అనేక మూలికలతో ఈ ఆయుర్వేద మందును తయారు చేశారు. తన సమీప బందువుకు కరోనా రావడం, అతనికి సీరియస్ అవడంతో ఈ మందు తయారు చేసిన ఆనందయ్య అది అతని బందువుకు ఇవ్వడం, అతను కరోనా భారి నుండి బయట పడడంతో, ఈ విషయం ఆ నోటా ఈ నోటా నెల్లూరు జిల్లా అంతా పాకింది. మెదట రోజు కు వంద మందికి ఈ మందు ఇచ్చే వారు, తాజాగా రోజుకు పది వేల మంది క్రిష్ణపట్నం వస్తున్నారు. ఇప్పటి వరకు 70 వేల మందికి ఈ మందు ఇవ్వగా ఎవరికి సైడ్ ఎఫెక్ట్ కాలేదని ఆనందయ్య చెబుతున్నారు. అయితే మెదట ఈ మందుకు అనుమతి లేదు, వచ్చే వారు మాస్క్ లు దరించడం లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు అనే కారణాలతో ప్రభుత్వం ఈ మందు పంపిణికి బ్రేక్ వేసింది. అయితే స్వయంగా జిల్లా డిఎం హెచ్ ఓ, అలాగే అధికారుల మందు ఆనందయ్య కరోనాతో సీరియగా ఉన్న రోగికి మందు ఇవ్వడం, రెండు రోజుల్లో అతను కోలుకోవడం తో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం, జిల్లా కలక్టర్ ప్రభుత్వానికి నివేధిక ఇవ్వడం, స్దానిక వైసిపి ఎమ్మెల్యే తో పాటు సిపిఐ నారాయణ, మాజి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్లు అనుమతివ్వాలని డిమాండ్ చేయడంతో, తిరిగి నాటు మందు వేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో రోజుకు పది వేల మందికి ఈ మందు అందించేందుకు ఆనందయ్య టీం సిద్దమయింది. అయితే ఉచితంగా ఈ మందు పంపిణి చేస్తున్న తనకు ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తతంగా అందించేందుకు సిద్దమని ప్రకటించారు. అయితే దీనిని అలోపతి వైద్య నిపుణులు, ప్రముఖ డాక్లర్లు కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తప్పని అంటున్నారు. ఆయుష్ డిపార్ట్ మెంట్ దీన్ని సర్టిఫై చేయలేదు, అలాగే డబ్యు హెచ్ ఓ, ఐసి ఎం ఆర్, అలాగే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అని మనం పెట్టుకున్నాక, ఏపి ప్రభుత్వం నాటు వైద్యానికి అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ఏం జరిగినా, ప్రాణాలకు హాని జరిగితే ఎవరిది భాద్యత అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆనందయ్య మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదు. కరోనా సోకకుండా ముందస్తు మందు కావాలనే వారికి ఒక రకం, కరోనా సోకి పాజిటివ్ వచ్చిన వారు నెగిటివ్ గా రావాలంటే ఒక రకం, శ్వాశ ఆడక ఆక్సిజన్ లెవల్స్ తగ్గి పోతే వారికి కంటిలో డ్రాప్స్ లా వేయడం మరో రకం వైద్యం అని, ఇలా ఐదు రకాల ఆయుర్వేద వైద్యాన్ని తాను ప్రజలకు అందిస్తున్నాని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ అంశం పై ఓ కమిటిని నియమించి ఆనందయ్య చేస్తున్న వైద్యం ద్వారా ఎలాంటి హాని ఉండదని తేల్చిన తరువాతే అనుమతించాలని హేతువాదులు ఆందోళన చేస్తున్నారు. మరో వైపు దీని పై కోర్ట్ కు వెళతామని హెచ్చరిస్తున్నారు. చైనా, భారత్ రెండు దేశాలు ఆయుర్వేదానికి పుట్టినిల్లు అని, దక్షణ భారత దేశం లో కేరళాను మించి ఆయుర్వేదంలో రాణించిన వారు లేరని, మని వీరేవరె కరోనా పై చేయని ప్రయోగాలు ఆనందయ్య చేశారా అని ప్రశ్నిస్తున్నారు. రామ్ దేవ్ బాబా లాంటి వాళ్లు కూడా కరోనాకు ఆయుర్వేదంలో ఇమ్యునిటి బూస్టర్ మాత్రమే ఉందని చెప్పారని గుర్తు చేస్తున్నారు. సో ప్రభుత్వం ఈ అంశం పై ఏంచేస్తుంది, ఆనందయ్య వైద్యం ఎంత వరకు సత్ఫలితాల్నిస్తుంది, అలోపతి వైధ్య నిపుణులు ఏం చేస్తారనేది వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: