ఢిల్లీ… రఘురామ క్రిష్ణంరాజు బెయిల్, మెడికల్ రిపోర్ట్ కేసులో సుప్రింకోర్టు విచారణ జరిపింది

Google+ Pinterest LinkedIn Tumblr +

ఢిల్లీ… రఘురామ క్రిష్ణంరాజు బెయిల్, మెడికల్ రిపోర్ట్ కేసులో సుప్రింకోర్టు విచారణ జరిపింది. సికింద్రాబాద్ ఆర్మిహాస్పటల్ వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ను సుప్రింకోర్ట్ న్యాయమూర్తి వినిత్ శరన్ చదివి వినిపించారు. ముగ్గరు డాక్టర్ల బ్రందం ఇచ్చిన ఈ నివేధికలో రఘురామ క్రిష్ణం రాజు కాళ్లకు గాయలున్నాయన్నారు. ఆయనకు జనరల్ ఎడిమియాతో పాటు కాలు ఫ్యాక్చర్ అయిందని నివేధిక లో పేర్కొన్నారు. అయితే దీని పై రఘురామ క్రిష్ణం రాజు లాయర్ ముఖుల్ రోహ్గతి ఆయనను కస్టడిలో చిత్రహింసలకు గురిచేశారని, తమ ఆరోపణలు నిజమని తేలాయన్నారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్దితి ఏంటని ప్రశ్నించారు. అయితే సిఐడి తరుపు లాయర్ దష్యంత్ దవే మాత్రం రాఘు రామ క్రిష్ణం రాజు కాలిగి గాయం చేసుకొని ఉండొచ్చన్నారు. దీని పై సుప్రింకోర్ట్ తనుకు తానే గాయం చేసుకొని ఉంటారని భావిస్తున్నారా, హాస్పటల్ కు తరలించే ముందు గాయం చేసుకున్నారా? అని ప్రశ్నించగా సిఐడి న్యామవాది నోరు మెదపలేదు. దీంతో రఘు రామ క్రిష్ణం రాజు లాయర్ ఈ కేసు విషయం పై సిబిఐ తో విచారణ జరిపించాలని, ఈ రోజే వాదనలు విని సుప్రింకోర్టు తీర్పు వెలువరించాలని కోరారు. కాగా సిఐడి తరపు న్యామవాది కేసును మంగళ వారానికి వాయిదా వేయాలని కోరగా, సుప్రింకోర్టు దీని పై విచారణ ను 2.30ని. చేపడతామని తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: