నో ఎంట్రీ…

Google+ Pinterest LinkedIn Tumblr +

నో ఎంట్రీ
కోవాక్సిన్ వేసుకున్న వారిని అనుమతించబోం
అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల అభ్యంతరం
భారత్ లో భారి డిమాండ్ ఉన్న కోవాక్సిన్
ఇక్కడ డిమాండ్… అక్కడ నో కారణం ఏంటి

ఢిల్లి…… కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అంటూ.. గల్ఫ్‌ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న విదేశీయులకు మాత్రమే అనుమతిస్తామంటూ సౌదీ అరేబియా ప్రకటించింది, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎయిర్‌లైన్స్‌కు సమర్పించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది. అయితే మరో వైపు అమెరికా, యూకె దేశాలు మాత్రం కోవాక్సిన్ వేసుకున్న పర్యాటకులకు, ఆదేశస్తులకు నో ఎంట్రి అని ప్రకటించింది. దీనికి గల కారణం కోవాక్సిన్ కు డబ్ల్యుహెచ్ ఓ అనుమతి లేకపోవడమే. ఇప్పటికే భారత్ లో చాలా మంది ఈ టీకా వేసుకున్నారు, కాని దానికి డబ్ల్యుహెచ్ ఓ అనుమతి ఇంకా రాని కారణంగా ఆ దేశాలు ఇలా నిర్ణయం తీసుకున్నాయట.

భారత్ లో కోవాగ్జిన్ కు భారి డిమాండ్…

గల్ఫ్‌, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలేవీ భారత్‌ ఉత్పత్తి చేసే కొవాగ్జిన్‌ను గుర్తించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాను తన జాబితాలో ప్రకటించలేదు. భారతీయులు చాలా మంది కొవాగ్జిన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. సెలవులపై మాతృదేశానికి వెళ్లిన అనేక మంది ప్రవాసీయులు తమ ఆధార్‌ కార్డుల ఆధారంగా కొవాగ్జిన్‌ తీసుకున్నారు. అయితే ఆధార్‌ కార్డులను కాకుండా పాస్‌ పోర్టులను మాత్రమే విమానయాన సంస్థలు గుర్తిస్తాయి. ఇటీవల బహ్రెయిన్‌ మీదుగా రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు వచ్చిన అనేక మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపించారు. వ్యాక్సిన్‌ దౌత్యం పేర మోదీ సర్కారు విదేశాలకు పంపిన టీకాల్లో అత్యధికంగా కొవిషీల్డ్‌ ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న ప్రవాసీయులు అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో వెళ్లలేక ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే భారత్ లో మాత్రం కోవాగ్జిన్ ను మంచి డిమాండ్ ఉంది. కోవాగ్జిన్ టీకా తీసుకుంటే 78 శాతం వ్యాది భారిన పడకుండా ఉండే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో భారత్ లో డిమాండ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీని ఉత్పత్తి పెంచి డోసులు ఇవ్వాలని కోరుతుండగా, మరో వైపు దీిని ఫార్ములా ఇస్తే జాన్సన్ అండ్ జాన్సన్, రెడ్డీ ల్యాబ్స్ ఇలా అనేక సంస్దలు ఉత్పత్తి చేస్తామని ముందుకు వచ్చాయి. ఈ తరుణంలో కోవాగ్జిన్ ను తయారు చేస్తున్న భారత్ భయోటెక్ సంస్ద మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: