వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోతే పెళ్లికి వచ్చిన ఓ అతిథిని ఒప్పించి పెళ్లి జరిపించారు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తర ప్రదేశ్………… సినిమాలో పెళ్లి పీటల నుంచి వధువు పారిపోతే పెళ్లి చూడడానికి వచ్చిన ఓ యువతిని ఒప్పించి పెళ్లి చేస్తారు పెళ్లి పెద్దలు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోతే పెళ్లికి వచ్చిన ఓ అతిథిని ఒప్పించి పెళ్లి జరిపించారు. కాన్పూర్‌ జిల్లాలోని మహారాజ్‌పూర్ పట్టణంలో జరిగిందీ సంఘటన.

స్థానిక సంప్రదాయం ప్రకారం.. జైమాల కార్యక్రమం (వధూవరులు దండలు మార్చుకోవడం) ముగిసింది. ఇక పెళ్లికి సంబంధించి ప్రధాన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇంతలో ఉన్నట్టుండి వరుడు కనిపించకుండా పోయాడు. వధువు, వరుడి కుటుంబ సభ్యులు బంధువులు అతడి కోసం తీవ్రంగా గాలించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇంతలో అతడు కావాలనే తప్పించుకుని పారిపోయాడని వధువు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలిసి రాలేదు.
వధువు ఒక్కతే పెళ్లి మండపంలో ఉండిపోవడం ఆమె కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందికి గురి చేసింది. దాదాపుగా వధువు పరిస్థితి కూడా అదే. అయితే ఇంత వరకు వచ్చిన పెళ్లి ఆగిపోకుండా పెళ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా పెళ్లికి సిద్ధంగా ఉన్నారోనని ఆరా తీశారు. లక్కీగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. వధువు కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి జరిపించారు. వరుడు ఒక్కడు మారాడేమో కానీ, పెళ్లైతే అనుకున్న విధంగానే అంగరంగ వైభవంగా జరిగింది.అనంతరం, పారిపోయిన వరుడు, అతడి కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: