పోలీసులపై దాడికి యత్నించిన యువకుడు…

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమన్ నగర్ డివిజన్ ఇమాద్ నగర్ బస్తీలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల తర్వాత ప్రజలు ఎవరు రోడ్లమీద తీరకుండ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సులేమాన్ నగర్ కాలనీ పరిధిలోని ఇమాద్ నగర్ బస్తి లో పోలీసులు గస్తీ కాస్తూ ఉండగా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించకుండా కనీసం తలకు హెల్మెట్ మొహానికి మాస్క్ కూడా లేకుండా అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన యువకుని సహోదరుడు పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళుతున్న యువకుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు తమ విధులు నిర్వహిస్తుండగా ఇలాంటి వారు నియమ నిబంధనలు పాటించకుండా రోడ్ల పైన తిరగడమే కాకుండా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: