ఓటీటీ వైపు తెలుగు సినిమాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా పరిశ్రమ కరోనా వైరస్ ప్రభావంతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. వరుస లాక్‌డౌన్‌లతో సినిమా రంగం నష్టాల వైపు మల్లటంతో చాలా సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. దీంతో కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ మార్కెట్‌ ద్వారా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి లాక్‌డౌన్ అనంతరం సినిమాల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో చాలా సినిమాలు థియేటర్లలో విడుదల చేశారు. ఆ దిశగా విడుదలకు సిద్దమైన కొత్త సినిమాలకు మరోసారి లాక్‌డౌన్ అంటూ ప్రభుత్వం చెప్పటంతో నిర్మాతలు ఓ రకంగా ఖంగుతిన్నారు.

ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పట్లో లాక్‌డౌన్‌ ఎత్తేసేలా కనిపించకపోవటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉన్నందున అక్కడ సినిమాలు విడుదలకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇదే జాబితాలో చేరింది అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం. దీంతో పాటు రానా విరాటపర్వం చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవే కాక చాలా చిత్రాలు ఈ వేదిక మీద విడుదలకు క్యూలో ఉన్నట్లు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: