ఇటల ఆ పార్టీలో చేరబోతున్నారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీమంత్రి ఇటల రాజేందర్ భూ కబ్జాకేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఆయనను పనికట్టుకుని వేదిస్తున్నారని ఇటల సానుభూతి వర్గం కోడైకూస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపాలనే వాదన కూడా బలంగా విస్తోంది. ఈ నేపథ్యంలో ఇటల ఇతర పార్టీలో చేరేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పార్టీ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్న ఆయన తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఏకంగా ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఇక దీనిపై కిషన్ రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడుతున్నామని పార్టీలో చేర్చుకునేది ఇంకా చెప్పాలేమని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఇటల కాంగ్రెస్‌లోనే చేరబోతున్నారనే వార్తలూ ఊపందుకున్నాయి.

దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న నేతగా ఇటల రాజేందర్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఇలా సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు భూ కబ్జా ఆరోపణలు రావటం ఓ రకంగా తనకు మచ్చ తెచ్చే పనేనని మేధావులు చేబుతున్న మాట. ఈ క్రమంలో టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాన్ని ఏకం చేసి పార్టీని సైతం స్థాపించబోతున్నారన్న వాదనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలపై మాటల యుద్దానికి తెరలేపారు. ఇక ఆయన బీజేపీలో చేరటం ఖాయమైందని త్వరలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు చర్చనియాంశంగా మారాయి. మరి ఇంతకు ఇటల బీజేపీలోనే చేరతారా ? లేక మరేదైన పార్టీలో చేరతారన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: