ఆనందయ్య మందుపై ఇంకా తేలని క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్..కంటికి కనిపించని ఈ పరుగుతో ప్రపంచమంతా కకావికలమైపోతోంది. కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గుతూ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి అత్యాధునిక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మంది ఈ వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య అనే ఆయూర్వేద వైద్యుడు సరికొత్త మందును తీసుకొచ్చి సంచలనంగా మారాడు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన వద్దకు వెళ్లటానికి పయనమైయి చాలామంది ఈ మందును వేసుకున్నారు. ఈ మందుతో ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఖచ్చితంగా అందరికి అందుబాటులో తేవాలని వాపోతున్నారు.

స్వచ్ఛమైన వనమూలికలతో తయారుచేసిన ఈ మందును ఆనందయ్య ఉచితంగా అందిస్తూ ప్రయివేట్ ఆస్పత్రులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దీంతో మందు పంపిణీ విషయం ప్రభుత్వం చెవిన పడటంతో మందు పంపిణీ పూర్తిగా నిలిపివేసింది. హుటాహుటిన ఆయూష్ కమిషనర్‌ చైర్మన్ రాములు ఆ మందు పంపిణీని పర్యవేక్షించి మందు వాడిని వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుని మందు పంపిణీని పూర్తిగా నిలిపివేస్తున్నామని సరైన ఆదేశాల వచ్చేంత వరకు ఆగాలని ప్రభుత్వం సూచించింది. ఈ రోజు రేపు అంటూ ఆనందయ్య మందుపై ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతుంది వైసీపీ ప్రభుత్వం. ఆనందయ్య మందు ఎప్పుడు అందిస్తారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: