ఆనందయ్య మందుపై ఉపరాష్ట్రపతి ఆరా

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఈ ఉదయం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రాలయ పరిధిలో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో ఆనందయ్య మందును ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించారు. పరిశోధన జరుపుతున్నామని వీలైనంత నివేదికను సిద్ధం చేస్తామనని తెలిపారు.

అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధనలు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు. అనంతరం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ. బలరాం భార్గవ్ తోనూ వెంకయ్యనాయుడు ఫోన్లో మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిది ఉండటంతో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: