ఏపీలో ఆనందయ్య..తెలంగాణలో భీమయ్య

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ దెబ్బకు కార్పోరేట్ కంపెనీలు లాభాల భాటలో పయనిస్తూ లక్షలు గుంజుతు శవాల మీద పేలాలు ఏరుకునేటట్లుగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య అనే ఆయూర్వేద వైద్యుడు వనమూలికలతో ఒక మందును తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మందు పంపిణీ అర్ధాంతరంగా నిలిచిపోవటంతో అనుమతులు వచ్చేంత వరకూ వైద్యం ఇవ్వరాదని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ మంచిర్యాలలోని మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కరోనాకు నాటుమందు ఇస్తున్నారు. గతంలో ఈయన సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. ఇప్పటికీ 300 మంది కరోనా పేషెంట్లను తన మందుతో ఆరోగ్యవంతుల్ని చేశానని చెబుతున్నారు. మాది వంశపారపర్యంగా వనమూలికలతో ఇలాంటి మందులు తయారు చేయటం మా తాత వద్ద నేర్చుకున్నానని తెలిపారు. ప్రభుత్వం అనుమతినిస్తే ఈ మందును తయారు చేయటానికి సిద్దంగా ఉన్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇలాంటి మందులు వాడి ప్రజలు రోగాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: