పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం-ఆదిమూలపు సురేశ్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో తాజాగా పదవ తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో పరీక్షల నిర్వాహణ సాధ్యం కాదని తెలుసుకుని టెన్త్ పరీక్షల వాయిదాకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు.

ఇక ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణ తప్పనిసరని దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పరీక్షల్లో వచ్చే మార్కులు విద్యార్థుల జీవితాలపై ఎంతో ప్రభావితం చూపుతాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వంపై చేయటం విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. దీంతో పాటు కేంద్ర స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ, రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఈ మార్కులు అవసరమన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: