రజినీ సినిమాలకు గుడ్ బై?

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలుకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా తన ఆరోగ్య పరిస్థతిపై ఆస్పత్రుల చుట్టు తిరుగుతుండటంతో నిజమే అనుకుంటున్నారు అభిమానులు. ఒక పక్క రాజకీయాల్లోకి వెళుతున్నట్లు బహిరంగంగా చెప్పినట్లే చెప్పి మళ్లీ రూటు మార్చారు. అయితే తాను రాజకీయాల్లో రావటానికి తన ఆరోగ్యం సహకరించటం తేదంటూ తనకు సమయం కావాలంటూ గతంలో చెప్పుకొచ్చారు తలైవా.

అయితే దీనిపై రజినీ స్పందిస్తూ.. ఇంకొనాళ్లు సినిమాల్లో నటించాలని ఉన్నా తనకు ఆరోగ్యం ప్రతీసారి సహకరించికపోవటంతో  ఇలాంటి వ్యాఖ్యలు చేశారట. తాజాగా అన్నత్తై మూవీ చిత్ర యూనిట్ తో తన ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలన్నట్లు తెలుస్తోంది. రజినీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒక రకంగా తలైవీ అభిమానులు నిరాశే అని చెప్పాలి. ఇంతకు రజినీ నిజంగానే సినిమాలకు వీడ్కోలు పలుకుతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: