సుషాంత్ డెత్ మిస్టరీలో ట్విస్ట్..సిద్ధార్థ్‌ పితాని అరెస్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ యువ హీరో సుషాంత్ సింగ్ ఆత్మహత్య కేసు ఎంత సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. తాజాగా అదే కేసులో ఇవాళ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు హైద‌రాబాద్‌లో సిద్ధార్థ్‌ పితానిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గ‌త ఏడాది జూన్ 14వ తేదీన అనుమానాస్ప‌ద రీతిలో బాంద్రాలోని త‌న ఇంట్లో సుశాంత్ మృతి చెందని విషయం తెలిసిందే. ఇక సుషాంత్ మృతి కేసును డ్ర‌గ్స్ కోణంలో విచార‌ణ చేపడుతున్నారు ఎన్సీబీ అధికారులు. గతంలో ఈ కేసులో అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అరెస్టు చేసి రిలీజ్ చేసింది. ఇక సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేరిక విషయంలో సహయపడిన మాఫియాను ప‌ట్టుకునేందుకు ఎన్సీబీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: