కేంద్ర సర్కారుపై కేటీఆర్ మండిపాటు

Google+ Pinterest LinkedIn Tumblr +

వ్యాక్సిన్ ఉత్పత్తిపై కేంద్ర సర్కారుపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు. ప్రభుత్వం నిబంధనల పేరుతో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిందని తెలిపారు.

నేటి కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్ పంపిణీలో కూడా రాష్ట్రాలకు అనుకున్నంత రాకపోవటం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. 85 శాతం వ్యాక్సిన్ లో 15 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. కంపెనీలు సైతం ధరల విషయంలో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య వ్యత్యాసం చూపుతున్నాయన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: