పోలీసుల చెంతకు ఆనందయ్య..రహస్య ప్రాంతానికి తరలింపు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందుపై రోజు రోజుకు కొత్త ఎపిసోడ్‌లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆనందయ్యను ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. దీంతో ఆయనను రహస్యప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆనందయ్య మందుపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండటంతో వేల సంఖ్యల్లో ఆయన మందును ఇప్పటికే తీసుకున్నారు.

దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి సరైన ఆదేశాలు రానంతవరకూ మందు పంపిణీని నిలిపివేయాలని తెలిపింది. ఇక ఈ మందుపై చాలా కోణాల్లో అధ్యయనం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఆనందయ్య మందుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఇక కేంద్ర సంస్థ అధ్యయన నివేదిక శనివారం రానున్నట్లు తెలుస్తొంది.

Share.

Comments are closed.

%d bloggers like this: