కొండెక్కిన గుడ్డు ధర

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ రాకతో జనాలు పిట్టల్లా రాలుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు జనాలు. ఇక దీంతో మాంసం, గుడ్లు వంటి పోషక పదార్థాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా చికెన్‌, గుడ్ల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి.

ఇక మొన్నటివరకు రూ.5గా ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో రూ.6.5 నుంచి రూ.7 వరకు పలుకుతోంది. కరోనా పుణ్యమా అని చికెన్, గుడ్ల ధరలు ఆకాశానంటుతుండటంతో సామన్యులు వాటిని కొనలేక నానతంటాలు పడుతున్నారు. ఇక కరోనా మహమ్మారి రోజు రోజుకు బుసలుకొడుతుండటంతో ప్రజలు తమ జాగ్రత్తల్లో ఉంటున్నారు. కేసులు సంఖ్య రోజు రోజుకు కాస్త తగ్గుముఖం పడుతుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: