ఓటీటీలో నితిన్, కీర్తి, ‘రంగ్ దే’ సినిమా?

Google+ Pinterest LinkedIn Tumblr +

కోరోనా విపత్కర పరిస్థితుల్లో ఓటీటీ వేదికగా చేసుకుంటున్నారు టాలీవుడ్‌లోని కొంతమంది సినీ నిర్మాతలు. తాజాగా అదే వేటలో ఉన్నారు ‘రంగ్ దే’ చిత్ర యూనిట్. నితిన్, కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
మార్చి లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాణించలేకపోయింది.

దీంతో సినిమా యూనిట్ ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. గతంలోనే రిలీజ్ చేసిన టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహానటి సినిమాలో తన నటనతో మంచి విజయాన్నే అందకున్న కీర్తి.. అంతగా అవకాశాలు మాత్రం రాబొట్టుకోలేకపోయింది. అయితే గతంలో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది కిర్తీ సురేష్. ఇక ‘రంగ్ దే’ సినిమా ఓటీటీ ద్వారా అయిన మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: