బెంగాల్ ప్రభుత్వానికి మెడీ షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీకి షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని వెంటనే రిలీవ్ చేయాలంటూ బాంబ్ పేల్చారు. దీనిపై స్పందించిన మమత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు మమత మెనర్జీ.

ఇక యాస్ తుఫానుపై నిర్వహించిన సమావేశంలో మమత పాల్గొనకపోవటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తక్షణమే ఆయనను రిలీవ్​ చేయాలని, కేబినెట్ నియామక కమిటీ సైతం ఆమోదం తెలిపిందని మమతా ప్రభుత్వానికి ఆదేశాలు పంపారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా..అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: