మళ్లీ మొదలుకానున్న ఐపీఎల్..యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫుల్‌స్టాప్ పడటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే దీనికి సంభందించిన మరో వార్త క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. కోవిడ్ దెబ్బకు అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లను మళ్లీ మొదలుపెట్టేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తాజాగా ఇదే అంశంపై స్పందించిన బీసీసీఐ మిగితా మ్యాచ్‌ల‌ను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇండియాలో రానున్న రోజుల్లో వర్షకాలం మొదలుకానుండటంతో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఇక తాజాగా జ‌రిగిన స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు బీసీసీఐ అధికారులు.

Share.

Comments are closed.

%d bloggers like this: