ఉప్ప‌ర్‌ప‌ల్లిలో ర్యాంపును ప్రారంభించిన కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉప్ప‌ర్‌ప‌ల్లిలో పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కనెక్టివిటీగా నిర్మించిన ర్యాంపును ప్రారంభించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రూ. 22 కోట్ల‌తో అత్తాపూర్ పిల్ల‌ర్ నెంబ‌ర్ 164 ద‌గ్గ‌ర ర్యాంపుల నిర్మాణం జరిగిందని దీని వల్ల ఐటీ ప్రాంతానికి తొందరగా వెళ్లే వీలుంటుందని తెలిపారు కేటీఆర్.

దీంతో ఇక నుంచి ఎయిర్‌పోర్టు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్ర‌యాణికులు ఉప్ప‌ర్‌ప‌ల్లి వ‌ద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్‌, ఇత‌ర ప్రాంతాల‌కు త్వరగా చేరుకొవచ్చారు మంత్రి కేటీఆర్. ఇక ఈ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అరవింద్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: