భవనం కూలి ఏడుగురు మృతి

Google+ Pinterest LinkedIn Tumblr +

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వివరాల్లోకి వెళితే ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ ఒక్కసారిగా కూలటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పక్కనున్న స్లాబ్‌కి కూడా కూలటంతో పరిస్థితి మరింత ఘోరానికి దారి తీసింది. వెంటనే అలర్ట్ అయిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యల్లో పాల్గొంది. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు అధికారులు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరికొంత మందిని కాపాడినట్లు జాతీయ విపత్తు అధికారులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: