తెలంగాణకు వర్ష సూచన

Google+ Pinterest LinkedIn Tumblr +

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉపరితల ద్రోణి కారణంగా ఉరు‌ములు, మెరు‌పులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. ఇక గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీస్తూ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ వర్ఫాలు పడ్డాయి. దీంతో నిన్నతెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు వివరాలు చూసుకున్నట్లైతే..గరిష్టంగా 36.0 నుంచి 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత, కనిష్టంగా 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమో‌దైంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: