ప్రారంభమైన ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ ప్రక్రియ

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రవాణా సంస్థ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు. దీంతో వీరికి మద్ధతుగా నిలిస్తూ ఆర్టీసీ డ్రైవ‌ర్లకి, కండ‌క్ల‌ర్లకి, సిబ్బందికి టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది ప్రభుత్వం.

నేడు ఎంజీబీఎస్‌తో పాటు ప‌లు జిల్లా కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో ఆర్టీసీ ఎండీ సునీల్ శ‌ర్మ ప‌రిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్క ఉద్యోగి వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇవాళ 16 వేల మందికి వ్యాక్సినేష‌న్ ఇస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఆర్టీసీ ఉద్యోగులు లెక్కచేయకుండా సేవ చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: