ప్రతీ జట్టులో ధోనీ లాంటి ఆటగాళ్లు ఉండాలి-పాంటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

టీ20 ఫార్మాట్‌లో చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని.. అది ధోనీ లంటి ఆటగాళ్లకే సాధ్యమని ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఆయన లాంటి ఆటగాళ్లు ప్రతీ జట్టులో ఉండటం చాలా అవసరమన్నారు. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతో పాటు ఆఖరి ఓవర్లలో వేగంగా రన్స్ చేయగలిగే ధోని లాంటి ఆటగాడిని ఆసీస్‌ జట్టు తయారు చేసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈయనతో పాటు హార్ధిక్‌ పాండ్యా, పోలార్డ్‌, స్టొయినిస్‌, పాట్‌ కమిన్స్‌ లాంటి ఆటగాళ్లు మంచి ఫినిషర్లుగా మారారని తెలిపారు. ప్రస్తుత ఆసీస్‌ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవలేదన్నారు పాంటింగ్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: