కొత్త ప్రయోగంతో హీరో రామ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా రెడ్ సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చిన ఎనర్టిటిక్ హీరో రామ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో నిరాశలో ఉన్న ఆయన ఈ సారి ఎలాగైన ఓ మంచి హిట్ కొట్టాలనే ఆవేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి తగ్గట్టుగానే ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సారి ఏకంగా తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో మూవీ చేసేందుకు సిద్దమయ్యాడంటూ ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఊర‌మాస్ అనే టైటిల్‌తో ముందుకు వస్తున్నాడట రామ్. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌ సినిమాలను గతంలో ప్రేక్షకులు అదరించిన విషయం తెలిసిందే. దీంతో చాలా కాలంగా ఇలాంటి సినిమాలకు బ్రేక్ పడటంతో రామ్ ఇలాంటి కథను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: