దుష్ప్రభావాలు లేనప్పుడు వివాదాలు ఎందుకు?

Google+ Pinterest LinkedIn Tumblr +

తనదైన శైలిలో కరోనా మందుతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపాడు ఆనందయ్య. ఈ మందుని ఏపీ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మందుపై ఒకవైపు ప్రశంసలు కూడా వస్తున్నాయి. తాజాగా ఆనందయ్య మందుపై స్పందించాడు చినజీయర్ స్వామి. ఉచితంగా పంపిణీ చేస్తున్న మందుపై ఇలాంటి అభ్యంతరాలు ఎందుకని, ఎలాంటి దుష్ప్రభావాలు లేనప్పుడు వివాదాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వివాదాలను రానియ్యకూడదంటూ తెలిపారు. ఎర్రడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: