చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిపై మండిపడ్డారు మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కేంద్రానికి ఎలా మద్దతు ఇస్తారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ పంథాకు తిలోదకాలు ఇచ్చేసి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా రైతుల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మెడీ సర్కార్ కు ఎలా మద్దతు పలుకుతారన్నారు. ఇక రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ జూన్ 5న వాటి ప్రతుల్ని దహనం చేయాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ను సైతం వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సంఘాలన్నీ తప్పకుండా పాల్గొనలన్నారు. తాజాగా ఢిల్లీలో చేస్తున్న రైతుల దీక్ష 6 నెలలకు చేరిన విషయం తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: