ఇండియాకు చోక్సీ..అంతా సిద్దం చేసిన భారత ప్రభుత్వం

Google+ Pinterest LinkedIn Tumblr +

బ్యాంకులను మోసగించి విదేశాలకు పరారైనట్లు తీవ్ర ఆరోపణలు మూటగట్టుకున్న వజ్రాల వ్యాపారీ మొహుల్ చోక్సీని భారత్ రప్పించేందుకు అంతా సిద్ధం అయినట్లు సమాచారం. దీనికి అవసరమైన పత్రాలన్నీ ఒక ప్రత్యేక విమానంలో ఇండియా ప్రభుత్వం పంపిందని తెలిపారు ఆంటిగ్వా ఆండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్. ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన జైళ్లో ఉంటూ చోక్సీ చేతికి ఉన్న గాయాల ఫోటో ఇప్పుడు బయటకు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13,500 కోట్ల అప్పు ఇవ్వకుండా పారిపోయిన నీరవ్ మోదీ, చోక్సీ నిందితులుగా ఉన్నారు. చోక్సీ ఇండియా నుంచి 2017లో పరారై ఆంటిగ్వా ఆండ్ బార్బుడా దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇక మే 23న కనిపించకుండ పోయిన ఇయన ఏకంగా ఆనుకుని ఉన్న డొమినాలో తేలడంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన ఆంటిగ్వా ఆండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ చోక్సీ డొమినాను తన ప్రియురాలి పుట్టిన రోజు వేడుకులకు బోట్ సహాయంతో వెళ్లిఉండవచ్చని, తిరిగి ఆయనను డొమినాకు పంపొద్దని తెలిపారు. ఒక వేళ పంపితే గనుక ఆ దేశపు రాజ్యాంగ చట్టాలు ఆయనకు రక్షణ కల్పించే అవకాశం ఉండొచ్చి తెలిపారు. దీంతో భారత ప్రభుత్వం ఆయనను ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: