మోడీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిశోర్ ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రధాని నరేంద్ర మెడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి పీఎం కేర్స్ ద్వారా సహాయం చేస్తామంటూ మెడీ ప్రభుత్వ ప్రకటనపై స్పందిస్తూ..తక్షణ సహాయం అందించాల్సిన సమయంలో 18 ఏళ్ల వరకూ వేచి ఉండటం ఏంటని ప్రశాంత్ కిశోర్ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న చిన్నారులు ఎప్పుడో వచ్చే ఆర్దిక సహాయం కోసం సంతోషపడాలా అంటూ ప్రశ్నించారు. మనకు రాజ్యాంగం కల్పించిన ఉచిత విద్యా హక్కును ఇప్పుడు స్కాం లా వాడుతున్నారంటూ ప్రశాంత్ కిశోర్ ఘాటుగా ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: