ప్రభాస్‌తో జక్కన్న మరోసారి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ దానికంటే ముందే రాజమౌళితో ఛత్రపతి సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరోసారి వచ్చిన చిత్రం బాహుబలి. ఆయన సినిమా కెరియర్‌లో లేనటువంటి గుర్తింపును సొంతం చేసుకున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే తాజాగా మరోవార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు రాజమౌళి ఓ కథను సిద్దం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో ఓ సినిమాను చేయనున్నాడట. దీని తర్వాత ప్రభాస్‌తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఆదిపరుష్, సలార్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఇంతకు వీరిద్దరి కలయికలో మరోసారి సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: