ఐపీఎల్‌కి దూరమవ్వనున్న కమిన్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐపీఎల్-14 మొదలై కొన్నిమ్యాచ్‌లు ఆడారో లేదో అప్పుడే వాయిదా అంటూ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మళ్లీ ఐపీఎల్ ఎప్పుడు అని అనుకునేలోపే యూఏఈ వేదికగా మళ్లీ నిర్వహిస్తున్నామంటూ మరో వార్తను ప్రకటించింది.

ఇక అన్ని దేశాల ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ ఆడతారో లేదో అన్న ప్రశ్న కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఇదే వార్తతో ముందుకొచ్చాడు కేకేఆర్‌ పేసర్ ప్యాట్ కమిన్స్. ఆయనే కాకుండా చాలా మంది విదేశీ ఆటగాళ్లు సైతం ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లు ఐపీఎల్‌కు వెళ్లాలా లేదా అనే నిర్ణయం త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: