టీఆర్‌ఎస్ పార్టీకి, మంత్రి పదవికి ఈటల రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఈటల రాజేందర్. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..ఉరి శిక్ష పడ్డ ఖైదీని చివరి కోరికైనా అడుగుతారని, కనీసం నా వివరణ కోరకుండా రాత్రికి రాత్రే తనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని తెలిపారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు ఈటల. ప్రాణం ఉండగానే నన్నుబొందపెట్టాలని ఆదేశాలిచ్చారని భావోద్వేగ ప్రసంగం చేశారు.

హుజురాబాద్‌లో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నాం, నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజురాబాద్ ప్రజలు చెప్పారని ఆయన అన్నారు. నేను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని తెలిపారు. ఇక ప్రగతి భవన్ గురించి స్పందిస్తూ…అది ప్రగతిభవన్ కాదని,,బానిస భవన్ అంటూ మండిపడ్డారు.

నాపై జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. నాకు హుజురాబాద్‌ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని ప్రకటించారు. ఈటలతో పాటు ఈ మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబయ్య ముదిరాజ్, ఇల్లంత కుంట ఎంపీపీ లతా శ్యామ్.. జమ్మికుంట మాజీ ఎంపీపీ తదితరులు ఉన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: