అది ప్రగతి భవన్ కాదు..బానిస భవన్-ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రగతిభవన్ గురించి మాట్లాడుతూ..అది ప్రగతి భవన్ కాదని..బానిస భవన్ అంటూ విమర్శించారు. నన్ను ఎన్ని కేసులు పెట్టి ఇరికించాలని చూసినా..ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. హుజురాబాద్‌లో పార్టీని ఏ ఎన్నికలు జరిగినా గెలిపించుకున్నామని ఆయన అన్నారు.

తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మొత్తానికి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఇంకా ఆయనతో పాటు మరికొంత మంది చేరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళుతున్నారంటూ ఓ పక్క వార్తలు వస్తున్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: