టీఆర్ఎస్‌కు షాక్..కారు దిగిన మరో నేత

Google+ Pinterest LinkedIn Tumblr +

టీఆర్ఎస్ కి మరో నేత గుడ్ బై చెప్పారు. ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆ పార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలామంది ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటల ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ రావటంతో టీఆర్ఎస్ లో ఉన్న వర్గం నేతలు ఒక్కక్కరుగా ఆయన చెంతకు చేరెందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక ఈటల బీజేపీలో చేరేందుకు తెరవెనకాల రంగం సిద్ధం చేస్తుండటంతో ఒక్కక్కరుగా ఆయన వెంట నడిచేందుకు నేతలు కారు దిగుతున్నారు. దీంతో పాటు ఇంకా చాలా మంది పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: