వైద్యుల సేవలపై ఉపాసన షార్ట్ ఫిల్మ్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా వైద్యులు అందిస్తున్న సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమవుతోంది రామ్ చరణ్ భార్య ఉపాసన. కోవిడ్ తో బాధపడుతున్న ఎంతోమంది ప్రాణాలకు ఊపిరిపోస్తూ వారు ఊపిరిని వదులుతున్నారని భావించారు ఉపాసన. వారి సేవల పట్ల ప్రేమతో ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటుదట. అయితే ఇందులో హీరో కోసం ఇద్దరితో చర్చలు జరుగుతున్నాయట.

అందులో మొదటగా తన భర్త రామ్ చరణ్ హీరొగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఉపాసన. అయితే ఆయనతో పాటు శర్వానంద్ ని కూడా కలవనున్నట్లు సమాచారం. మరి ఉపాసన తీయబోయే ఈ చిత్రానికి హీరో ఎవరో అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: