ఆయనపై అంత ఘోరంగా ప్రవర్తిస్తారా?-సుమలత

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు థర్డ్ డిగ్రీ జరిగిందంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఇక ఆయనను కాళ్లపై కొట్టారని, పోలీసులు హింసించారని వంటి వార్తలపై స్పందించింది కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత. రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్బ్రాంతికరమని, నమ్మలేకపోతున్నానని అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ విషయం నన్ను పూర్తిగా షాక్‌లోకి గురి చేసిందంటూ చెప్పుకొచ్చింది. దీనిపై తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని లేకుంటే ఏపీ పోలీసులపై చెడు అభిప్రాయం చూపే అవకాశం ఉందంటూ తెలిపారు. సుమలత ప్రముఖ నటిగా, రాజకీయనాయకురాలిగా గుర్తింపును పొందింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: