ఎన్టీఆర్‌తో రాజమౌళి మరోసారి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూకుడుమీదున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణలోనే ఉంది. కరోనా కారణంగా వాయిదా పడ్డా ఈ చిత్ర షూటింగ్ పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ మొదలువుతుంది.

ఇక ఇదంతా బాగానే ఉన్నా ఎన్టీఆర్ మరోసారి రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు ఓ రేంజ్ లో వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం దీని తర్వాత చేసే సినిమాలకు అప్పుడే లైన్ లోనే పెట్టుకున్నాడట. కొరటాలతో మరోసారి చేయనుండగా కేజీఎఫ్ సినిమాతో తన సత్తాను చాటిన ప్రశాంత్ నీల్ తో కూడా ఓ మూవీ చేయనున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత మళ్లీ జక్కన్నతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: