తమిళనాడులో హిజ్రాలకు కొత్త శాఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

హిజ్రాలు వారికి ప్రత్యేక హక్కుల కోసం చాలా ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి తీపి కబురును తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలిపింది తమిళనాడు ప్రభుత్వం. తాజాగా హిజ్రాలకు ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు అంశంపై పరిశీలిస్తున్నట్లు మంత్రి గీతాజీవన్‌ తెలిపారు.తూత్తుకుడిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

హిజ్రాలకు సమాజంలో గుర్తింపు రావాలంటే వారికి విద్యా, ఉపాధి వంటి రంగాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇక రాష్ట్రంలో హిజ్రాల సంఖ్యను చూసుకుంటే 11 వేలు మంది ఉన్నారని తెలిపారు. ఇక వారి కోసం ప్రత్యేక శాఖను కేటాయించే పనిలో సీఎం స్టాలిన్ ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి. త్వరలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేయనున్నామని తెలిపారు మంత్రి గీతాజీవన్‌.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: