19 జిల్లాల్లో డయోగ్నొస్టిక్ సెంటర్లు..సోమవారం నుంచే సేవలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో డయోగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 19 జిల్లాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. శనివారం వైద్య సేవలు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు వంటి వాటిపై సీఎం ప్రగతి భవన్ లో చర్చించారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ప్రజల కోసం ఉచితంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువైందని అన్నారు. ఇక నూతనంగా ఏర్పాటు చేయబోయే డయోగ్నొస్టిక్ కేంద్రాల్లో 57 పరీక్షలను ఉచితంగా అందిస్తామని తెలిపారు సీఎం. ఇక మహబూబాబాద్, జగిత్యాల, భదాద్రి, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయోగ్నొస్టిక్ కేంద్రాల్లో సోమవారం నుంచిసేవలు అందుబాటులోకి రానున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: