సీఎంను తొలగించాలంటూ డిమాండ్..క్లారిటీ ఇచ్చిన అగ్ర నేత

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్పను తొలగిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు ఓ మాదిరిగా వస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయనను తొలగించటం ఏంటని కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వార్తలపై స్పందించింది బీజేపీ అగ్రనాయకత్వం.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పందిస్తూ.. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో యడియూరప్పను తొలిగించే అవకాశాలు లేవని, అవన్నీ పుకార్లు మాత్రమేనని తెలియజేశారు రవి. ఇక యడియూరప్పను తొలగించాలని అర్వింద్ బెల్లాడ్, ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: