ఆనందయ్య మందు పంపిణీకి అంతా సిద్ధం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గత కొన్ని రోజులు నుంచి ఆనందయ్య మందుపై వివాదాలకు తెర పడటంతో పంపిణీకి రంగం సిద్ధమైంది. తాజాగా ఇటు ఏపీ ప్రభుత్వం అటు హైకోర్టు నుంచి అనుమతులు రావటంతో అధికారికంగా పంపిణీ చేసుకునేందుకు అంతా సిద్ధమైంది.

ఇక రేపటి నుంచి మందు పంపిణీ జరగనుందని తెలిపారు ఆనందయ్య శిష్యులు. మందును మందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎవరూ కృష్ణ‌ప‌ట్నం రావొద్దని తెలిపారు. కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్షన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: